17-04-2025 12:05:31 PM
హైదరాబాద్: మూటల వేట సీఎందే.. సీఎస్, అధికారులు బలిపశువులవుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తెలంగాణ భవన్ లో గురువార మీడియా సమావేశంలో అన్నారు. ఐఏఎస్, అటవీ అధికారుల వంతైంది.. అధికారులు జాత్రత్తగా ఉండాలని కేటీఆర్ సూచించారు. రేవంత్ రెడ్డి సైన్యంలా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించిన కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ఇష్టానుసారం కేసులుపెట్టిన పోలీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రైవేటు ముఠాలా చేస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుందని ఆయన మందలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ఎండగట్టిందని కేటీఆర్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు వాదోపవాదనలు విన్న తర్వాత సామాన్యుడికి న్యాయస్థానాల మీద గౌరవం పెరిగిందని కేటీఆర్ తెలిపారు. ఆత్మాభిమానం ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా రాజీనామా చేసేవారని తెలిపారు. కానీ సీఎం రేవంత్ రెడ్డికి ఆత్మాభిమానం లేదని ఎద్దేవా చేశారు. ఇది పర్యావరణ ప్రేమికుల విజయం.. మేం గత వారం రోజులుగా ఏం చెప్పామో, సెంట్రల్ కమిటీ అదే చెప్పిందన్నారు. కేంద్రప్రభుత్వం దర్యాప్తు చేయాలి.. దర్యాప్తు సంస్థలు మీ చేతుల్లోనే ఉన్నాయని తెలిపారు. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పిన తర్వాత కేంద్రప్రభుత్వం(Central Government) ఎందుకు వెనక్కి పోతుంది.. కేంద్ర కమిటీ రిపోర్ట్ తర్వాత ఏం చేస్తారో బీజేపీ నేతలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
బీజేపీ(Bharatiya Janata Party)కి చిత్తశుద్ధి ఉందా? లేదా? అనేది నెలాఖరు వరకు ఎదురుచూస్తామని కేటీఆర్ చెప్పారు. నెలాఖరులో బీఆర్ఎస్ భేటీ తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్దకు వెళ్తామన్నారు. ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అందజేస్తామన్నారు. అప్పటికీ స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో బీజేపీని ఎండగడతామని కేటీఆర్ సూచించారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వాన్ని బీజేపీ కాపాడుతుందని చెప్పాల్సి వస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ఆర్థిక దోపిడీ, పర్యావరణంపై దాడి విషయమై ప్రధాని స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్పందించకపోతే ప్రధానికి కూడా పాపంలో వాటా ఉందని భావించాల్సి వస్తుందని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి బయటకు రావాలని కోరారు. ఫార్ములా ఈ రేసులో మంత్రిగా విధాన నిర్ణయాలు తీసుకున్నా అని చెప్పానని కేటీఆర్ తెలిపారు. ఫార్ములా ఈ రేసులో అధికారులను బలిపశువులను చేయలేదని వెల్లడించారు. ఫార్ములా ఈ రేసులో అభ్యంతరం ఉంటే తానే బాధ్యత తీసుకుంటానని కేటీఆర్ పేర్కొన్నారు. మంచి జరిగితే నాది.. చెడు జరిగితే అధికారులను బలిపశువులను చేయవద్దని కేటీఆర్ తెలిపారు.
రేవంత్ రెడ్డి ఐదేళ్లు అధికారంలో ఉండాలి.. ఈ దిక్కు మాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మ తమకు లేదని కేటీఆర్ అన్నారు. ప్రజలకు కోపం వస్తే వాళ్ళే రోడ్డెక్కి ప్రభుత్వాన్ని తొక్కుతారు బాంగ్లాదేశ్‌లో లాగా అవుతుందన్నారు. పెద్ద పెద్ద నియంతలే కొట్టుకుపోయారు రేవంత్ రెడ్డి ఎంత? అని కేటీఆర్ చమత్కరించారు. ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం.. తమ దగ్గర కూడా ప్రజలు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్తున్నారని వెల్లడించారు. కానీ ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డే అధికారంలో ఉండాలి.. అప్పుడే ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలంటే ప్రజలు భయపడతారని కేటీఆర్ స్పష్టం చేశారు.