calender_icon.png 31 January, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ పని ఖతం..!

29-01-2025 12:00:00 AM

ఎంపీ రఘునందన్‌రావు విమర్శ

మెదక్, జనవరి 28 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా, ఉద్యమగడ్డ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనకడుగు వేయడంతోనే బీఆర్‌ఎస్ పని అయిపోయిందని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్రావు విమర్శించారు.

మంగళవారం ఆయన మెదక్లోని టీఎన్జీవో భవన్ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణకు మార్గదర్శి, బడా నేతలు గల పార్టీ అని చెప్పుకునే బీఆర్‌ఎస్లో ఆ పార్టీకి సొంత జిల్లాలో కేసీఆర్కు ఒక్క అభ్యర్థి కూడా లభించడం లేదాని ప్రశ్నించారు. మెదక్ అంటేనే ఉద్యమాల గడ్డని, ఈ గడ్డ నుండి ఎందరో ఉద్యమకారులు ఉన్నారని తెలిపారు.

వరంగల్ ఎన్నికల్లో పక్కపార్టీ నుంచి అభ్యర్థిని తీసుకువచ్చి రూ.50 కోట్లు ఖర్చు చేసిన బీఆర్‌ఎస్ పార్టీకి కరీంనగర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచేందుకు ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ యువరాజు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు.

టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్గా మారినప్పుడే ఆ పార్టీ పని అయిపోయిందని, రానున్న రోజుల్లో జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా ఆ పార్టీ ఉండదని జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్ పోటీ ఇవ్వకపోవడంతోనే బీజేపీ గెలుపు ఖాయమని స్పష్టమైందని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీకి, నేతలకు ప్రజలు వీఆర్‌ఎస్ ఇచ్చారని దుయ్యబట్టారు.

ఈ సమావేశంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, అసెంబ్లీ ఇంచార్జి పంజ విజయ్కుమార్, నాయిని ప్రసాద్, ఎంఎల్‌ఎన్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.