calender_icon.png 26 January, 2025 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు దక్కవ్

24-01-2025 12:46:37 AM

  1. కావాలనే గ్రామసభల్లో అవాకులు చవాకులు 
  2. రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి   

ఖమ్మం, జనవరి 23 (విజయక్రాంతి): గ్రామసభల్లో ప్రతిపక్ష నాయకులు కావాలనే సమస్యలు సృష్టిస్తున్నారని రెవెన్యూశాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాపోయారు.

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మం  కేశవాపురం, తిప్పారెడ్డిగూడెం జల్లేపల్లి,హైదర్‌సాయిపేట, పడమటి తండా, జోగులపాడు తదితర గ్రామాల్లో గురువారం పర్య   పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చే  ఈ సందర్భంగా గ్రామాల్లో జరిగిన స లనుద్ధేశించి పొంగులేటి మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉండి ఒక్క పేదవానికి న్యాయం చేయలేకపోయిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజాప్రభుత్వం చేసే మంచి పనులను చూసి ఓర్వలేకపోతుందన్నారు.

వాళ్ల వైఖరి మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని స్పష్టంచేశారు. గ్రామసభల్లో చదివే జాబితా తుది జాబితా కాదని, ఈ నెల 26 నుంచి అమలు కాబోతున్న నాలుగు పథకాల జాబితాలో పేర్లు రాలేదని ఎవరూ  ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. జాబితాలో పేరు ఉం  ఉన్నట్లు లేకపోతే రానట్లు కాదన్నారు.  ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య పాల్గొన్నారు.