20-04-2025 12:48:39 AM
ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాం తి): మాజీ మంత్రి కేటీఆర్ ప్రతిసారి రేవం త్‌రెడ్డి దిగిపో దిగిపో అంటున్నాడని, దిగిపో డానికి ఇది వారిచ్చిన అధికారం కాదాని, ప్రజలు ఇచ్చారని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ అన్నారు. శని వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అరాచకాలు, దుర్మార్గాలు, కుటుం బ పాలన భరించలేక ప్రజలు అధికారం నుంచి దింపేశారన్నారు.
10 ఏళ్లు అధికారం ఇస్తే ఫామ్‌హౌస్‌లో ఉండి ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. ఇక కేసీఆర్, బీఆర్‌ఎస్ ఏమీ చేయలేరని నమ్మి కాంగ్రెస్‌కు అధికా రం ఇచ్చారని చెప్పారు. ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుదని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి కాలి గోటికి కేటీఆర్ సరిపోడని మండిపడ్డారు.
కేటీఆర్ పోటీ చెల్లి కవిత, బావ హరీశ్‌రావుతోనేనని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఎప్పటి కైనా హరీశ్‌రావు అధ్యక్షుడు అవుతాడని కేటీఆర్‌కి భయం పట్టుకుందని విమర్శిం చారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచిస్తూ పని చేస్తున్నారని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధే ఆయన లక్ష్యమన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు ఇంక కేసీఆర్‌కి గులాంగిరే చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌పై చిల్లర మాటలు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. కేటీఆర్ స్టడీ సర్టిఫికెట్స్ తెస్తే అప్పుడు తెలంగాణ వాసో కాదో తెలుస్తుందన్నారు.