10-04-2025 01:36:10 AM
మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్, ఏప్రిల్ 9(విజయక్రాంతి):బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 27వ తేదీన వరంగల్_ ఎల్కతుర్తి వద్ద జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి బిఆర్‌ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మెదక్ జిల్లా కేంద్రంలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో పద్మ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ కన్వీనర్ మామిళ్ళ ఆంజనే యులు, నాయకులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్టాడుతూ ఈనెల 27వ తేదీన ప్రతి గ్రామంలో బిఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి వరంగల్ భారీ బహిరంగ సభకు పా ర్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ తరపున వాహనాలు ఏర్పాటు చేస్తామన్నా కార్యకర్తలు వద్దన్నారని, వారే స్వయంగా తామే వాహనాలు ఏర్పాటు చేసుకొని హాజరవుతామని చెప్పినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అంజాగౌడ్, మాజీ కౌన్సిలర్ జయరాజ్, పట్టణ కో కన్వీనర్ జుబేర్ అహ్మద్,మెదక్ పిఎసిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.