27-04-2025 01:53:35 PM
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district) బిచ్కుంద మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే(Former MLA Hanumant Shinde) బీఆర్ఎస్ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ 25వ వసం తాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెండా ఆవిష్కరణ జరిపినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ నాయకత్వం కీలకమైందని, ఆయన నేతృత్వంలో పనిచేయడం గర్వకారణమని వ్యాఖ్యానించారు.బిఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రం ఏర్పడిందని, భవిష్యత్తు బిఆర్ఎస్ పార్టీ దేనన్నారు. అనంతరం చలో వరంగల్ కార్యక్రమం లొ భాగంగా డోంగ్లీ, మద్నూర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే నేతృత్వంలో ఆదివారం ఉదయం డోంగ్లీ గ్రామానికి సరిహద్దుల్లో గల మేనూర్ చౌరస్తాలో వరంగల్ సభకు తరలి వెళ్లారు. హన్మంత్ షిండే కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సభకు ఉత్సవంగా పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో వెళ్లినట్లు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పేర్కొన్నారు.