పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవా రం నరేందర్‌రెడ్డి అరెస్టున నేపథ్యంలో కేటీఆర్ హైదరాబాద్‌లోని నరేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. నరేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించా రు.
కేసు వివరాలు చెప్పకుండానే పోలీసులు నరేందర్‌రెడ్డిని అరెస్టు చేశారని కుటుంబ సభ్యులు కేటీఆర్ తో చెప్పారు. ధైర్యంగా ఉండాలని, నరేందర్‌రెడ్డి విడుదల కోసం పార్టీ పోరాడుతుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.