calender_icon.png 3 April, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్‌సభలో ప్రాతినిధ్యం లేదు.. రాజ్యసభలో వ్యతిరేకిస్తాం: కేటీఆర్

02-04-2025 02:11:58 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): లోక్ సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తాందని బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాజ్యసభ విషయానికి వస్తే తమ పార్టీ నాయకులు సభలో తమ వాదనను వినిపిస్తారని, ప్రతిపక్ష పార్టీకి లోక్‌సభలో ప్రాతినిధ్యం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది రేపు రాజ్యసభకు వస్తుంది. లోక్‌సభలో తామ సభ్యులు లేరని, ప్రస్తుతం ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించాలని మేము నిర్ణయం తీసుకున్నామన్నారు. బిల్లులో నాలుగు లేదా ఐదు విభాగాలు ఉన్నందున మాకు అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో సభలో వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కే.టీ.రామారావు చెప్పారు. ఎగువ సభలో బీఆర్ఎస్ కు నలుగురు సభ్యులు ఉన్నారని, వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లును బుధవారం లోక్‌సభ చర్చ, ఆమోదం కోసం స్వీకరిస్తుంది. ఈ బిల్లును రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.