16-04-2025 01:31:50 AM
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్, ఏప్రిల్15(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 27న తలపెట్టిన బహిరంగ సభకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడికోశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం హుజురాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సభ రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఈ సభకు ప్రజలు తరలివస్తున్నారని, అన్ని నియోజకవర్గాల కంటే హుజురాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా ప్రజలు హాజరై ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతను చూపించాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు వదిలిపెట్టేదే లేదని అన్నారు. హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే తనపై కేసులు నమోదు చేస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టిన ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాటానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ముఖ్యంగా రైతులకు రైతుబంధు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ బందు పెట్టిందన్నారు. బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసి ప్రభుత్వానికి దిమ్మతిరిగేలా చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాల పట్ల రాష్ట్ర ప్రజలు విరక్తి చెంది ఉన్నారని, రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా గుణపాఠం చెబుతారని అన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, అపరాధ ముత్యంరాజు, ములుగు సృజనాపూర్ణ చందర్, కిషన్, కల్లపల్లి రమాదేవి, కేసిరెడ్డి లావణ్య, ఆర్కే రమేష్, కోయడ కమలాకర్, పట్టణంలోని అన్ని వార్డుల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .