calender_icon.png 12 February, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ మూడు ముక్కలు!

12-02-2025 02:04:41 AM

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో కనిపించదు: పీసీసీ చీఫ్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చకు సిద్ధమా..? అని పీపీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు. కేటీఆర్ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలకడం ఆపేసి దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని డిమాండ్ చేశారు.

చెల్లి, బావ ఇచ్చిన షాక్‌తో కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడ ని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ మూడు ముక్కలుగా చీలిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కనిపించదన్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ లోపాయికారీ ఒప్పందంపై చర్చకు రావాలన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తామని చెప్పారు.  సీఎం రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత  కేటీఆర్‌కు లేదన్నారు.