- ఈనెల 30 నుంచి డిసెంబర్ 7 వరకు.. గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూల్స్ సందర్శన
- ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ
- నివేదికను అసెంబ్లీలో లేవనెత్తుతాం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ లో మధ్యాహ్న భోజనం అమలు, ఫుడ్‌పాయిజన్ ఘటనలు, విద్యార్థుల మరణాలను బీఆర్‌ఎస్ సీరియస్‌గా తీసుకున్నది.
ఇందు లో భాగంగానే ఆ పార్టీ గురుకుల బాట కార్యక్రమాన్ని చేపట్టేందుకు సన్నద్ధమైంది. ఇందుకు గానూ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన అధ్యయన కమిటీని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ప్రకటించారు. ఈనెల 30 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ అధ్యయన కమిటీ రాష్ర్టంలోని గురుకులాలతోపాటు కేజీబీవీ లు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను పరిశీలిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, విద్యార్థి విభాగం నాయకులు సహకారం అందించాలని కేటీఆర్ కోరారు. బాలికల విద్యాసంస్థలను పార్టీ తరఫున విద్యార్థి విభా గం, పార్టీ మహిళా నాయకులు గురుకులాలను సందర్శించి బాలికల సమస్యలను అధ్యయనం చేసి నివేదిక ఇస్తారని చెప్పారు.
38సార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు..
గురుకులాల్లో విద్యార్థులు మరణించడం, విషాహారం కారణంగా హాస్పిటల్ పాలవుతున్న ఘటనలపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పాలనను గాలికొదిలేసి విద్యార్థుల కు చావులకు ఈ ముఖ్యమంత్రే కారణమవుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ర్ట వ్యాప్తం గా 48 మంది విద్యార్థులు మరణించడం బాధాకరమన్నారు.
విద్యాసంస్థల్లో ఉన్న దు ర్భరమైన పరిస్థితులను తట్టుకోలేక 23 మం ది ఆత్మహత్యలు చేసుకున్నారని.. మరో 8 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెం దారని వెల్లడించారు. నలుగురు విషాహారం తిని.. మరో 13 మంది అనారోగ్యంతో చనిపోయారన్నారు.
ఇప్పటివరకు 38సార్లు ఫు డ్ పాయిజన్ ఘటనలు జరిగాయని.. 886 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా న లుగురు మరణించారన్నారు. వాంకిడిలో వి షాహారం తిని విద్యార్థిని శైలజ చనిపోయిన ఘటన మరువకముందే మహబూబ్‌నగర్ జిల్లాలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగటం ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనమని మండిపడ్డారు.
అధ్యయన కమిటీ ఇదే..
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీని వేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సహా సభ్యులుగా డాక్టర్ ఆంజనేయు లుగౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజారామ్‌యాదవ్, వాసుదేవరెడ్డి ఉంటారన్నారు. విద్యా ర్థుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు విద్యాసంస్థల నిర్వహణ, సమస్యలపై సమగ్ర అవగా హన ఉందని కేటీఆర్ గుర్తు చేశారు.
ఈ కమిటీ రాష్ర్టవ్యాప్తంగా గురుకులాలు, ఇతర పాఠశాలలను సందర్శించి అక్కడి స్థితిగతులు, సౌకర్యాలు, పరిస్థితులను తెలుసుకో నుందన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలు, తీసుకో వాల్సిన చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుందని తెలిపారు.
సంక్షోభంలోకి గురుకుల విద్య..
పరిపాలనా అనుభవం లేని సీఎం విద్యాశాఖను తన వద్ద ఉంచుకోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మొదటి ఘటన జరిగినప్పుడే స్పం దించి ఉంటే ఇంతమంది ప్రాణాలు పోయేవి కాదన్నారు. ఢిల్లీకి 28సార్లు వెళ్లటానికి సీఎంకు సమయం ఉంది కానీ.. విద్యార్థులు చనిపోతుంటే ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించాలన్న సోయి లేదా? అని నిలదీశారు.
పిల్లలకు సరైన అన్నం పెట్టలేని చేతకాని ప్ర భుత్వమిదని మండిపడ్డారు. ఇది ప్రజాపాలన కాదు.. విద్యార్థులను పొట్టన పెట్టుకుంటున్న పాపపు పాలన అని మండిపడ్డారు. ప్రభుత్వానికి తప్పకుండా విద్యార్థుల ఉసురు తగులుతుందని, నిర్వహణ చేతగాక గురుకుల విద్యను సంక్షోభంలోకి నెట్టిందన్నారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం..
కమిటీ అందించే నివేదిక ఆధారంగా గురుకులాల సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలను ప్రభుత్వానికి సూచిస్తామని కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకుంటే వివిధ రూపాల్లో సర్కారుపై ఒత్తిడి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
ఈ అంశాన్ని తాము రాజకీయం చేసేందుకు ప్రయత్నించటం లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల మరణాలను నివారించటంలో విఫలమవటం, నాణ్యమైన ఆహారాన్ని అందించలేకపోవడంపై ప్రభుత్వమే ఆత్మవిమర్శ చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. అదే విధంగా కమిటీ నివేదికలో ప్రస్తావించే అంశాలను తాము శాసనసభలో లేవనెత్తుతామని కేటీఆర్ తెలిపారు.