17-03-2025 05:26:57 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో(Telangana Assembly Budget Sessions) భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు(BC Reservation Bill) భారత్ రాష్ట్ర సమితి పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, సంపూర్ణంగా మద్దతిస్తుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(MLA Thanneeru Harish Rao) పేర్కొన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు వచ్చినప్పుడే సంతోషిస్తామని, స్థానిక సంస్థల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రిజర్వేషన్ల ఫలాలు అందినప్పుడే బీసీలు సంతోషిస్తారని ఆయన తెలిపారు. వారికి ఆ ఫలితాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. బీసీల రిజర్వేషన్ల కోసం శాసనసభ ఏకగ్రీవ తీర్మానానికి కలిపిస్తామని, అలాగే పార్లమెంటులో కూడా పోరాటానికి బీఆర్ఎస్ వస్తుందని స్పష్టం చేశారు. బిల్లుపై పార్లమెంటులో రాహుల్ గాంధీ ఒత్తిడి తీసుకురావాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.