calender_icon.png 12 March, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం

12-03-2025 11:57:17 AM

బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలను అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్: బీఆర్ఎస్ విద్యార్థి విభాగం(BRS student wing ) తెలంగాణ అసెంబ్లీ ముడ్డికి యత్నించింది. విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి బడ్జెట్(Education sector Budget )లో 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi ) విద్యార్థి విభాగం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ప్రసంగించారు. తమ ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉందని, అభివృద్ధి, ప్రగతివైపు తెలంగాణ అడుగులు వేస్తోందని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ(Governor Jishnu Dev Varma) తెలిపారు.