25-04-2025 10:13:08 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం ఎల్కతుర్తి సభాస్థలిని వనమా రాఘవ సందర్శించారు. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా ఈనెల 27వ తేదీన జరిగే భారీ బహిరంగసభ కోసం కొనసాగుతున్న పనులను మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ నాయక్, జాజాల సురేందర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతా మహాలక్ష్మి, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జి రామకృష్ణ తదితరులతో కలిసి పరిశీలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సభకు వాహనాలు వచ్చే మార్గం, వాటిని నిలిపి ఉంచే స్థలం, అనంతరం తిరిగి వెళ్లే రోడ్డు వివరాలను ఎంపీ రవిచంద్ర మ్యాప్ ద్వారా నాయకులు, సమన్వయకర్తలకు వివరించారు. మ్యాప్ ప్రతులను ఎంపీ వద్దిరాజు వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, పాల్వంచ టౌన్ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, డిష్ నాయుడు, కొత్తగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, ఉర్దూఘర్ మాజీ ఛైర్మన్ అన్వర్ పాషా, మాజీ కౌన్సిలర్లు అంబుల వేణు, రుక్మాందర్ బండారి, వేముల ప్రసాద్, దూడల కీరణ్, నవతన్, కంచర్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.