calender_icon.png 31 October, 2024 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్తలకు అండగా బీఆర్‌ఎస్

03-07-2024 12:05:00 AM

ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి

గజ్వేల్/ కొండపాక, జూలై 2: బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. కొద్దిరోజుల క్రితం చెరువులో పడి మృతిచెందిన కోమటిబండ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు ఉబ్బని అశోక్ కుటుంబానికి మంగళవారం పార్టీ తరఫున రూ. 2 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించిన ఏకైక నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తూం శేఖర్ పటేల్, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, జెడ్పీటీసీ పంగ మల్లేశం, మాదాసు శ్రీనివాస్, బొల్లారం ఎల్లయ్య పాల్గొన్నారు. అదేవిధంగా కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త జక్కుల మమత కుటుంబానికి పార్టీ బీమా కింద మంజూరైన రూ.2 లక్షల చెక్కును ఆమె భర్త అనిల్‌కు వంటేరు ప్రతాప్ రెడ్డి చేతులమీదుగా అందజేశారు