calender_icon.png 16 March, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ అసత్య ప్రచారాలు చేస్తుంది

15-03-2025 12:50:09 AM

దేవరకద్ర కాంగ్రెస్ నాయకులు 

దేవరకద్ర మార్చి 14 : టిఆర్‌ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నారని దేవరకద్ర కాంగ్రెస్ మండల అధ్యక్షులు అరవింద్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కోయిల్ సాగర్ ఆయకట్టు సాగునీటి విడుదల విషయంలో మాజీ ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

గత డిసెంబర్ లో కోయిల్ సాగర్ ఆయకట్టు రైతులతో కలెక్టర్ గారి అధ్యక్షతన, ఎమ్మెల్యే సమక్షంలో నిర్వహించిన సమావేశంలో యాసంగి పంటకు లెఫ్ట్ కెనాల్ ద్వారా పాత ఆయ కట్టు (21, 22) డిస్ట్రిబ్యూట్ కెనాల్ ద్వారా గురకొండ, బలుసుపల్లి, దేవరకద్ర వరకు నీళ్లు ఇస్తామని కలెక్టర్  అట్టి సమావేశంలో నిర్ణయించారని, ఆ షెడ్యూల్ ను రైతులకు సోషల్ మీడియా ద్వారా, మీడియా ద్వారా రైతులకు కలెక్టర్ అధికారికంగా ప్రకటించడం జరిగిందన్నారు.

ఇట్టి విషయం తెలిసి కూడా బిఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై బురద చల్లాలన్న నెపంతో, రైతులను రెచ్చగొట్టి, మభ్యపెట్టి మాట్లాడించడమే కాక .. సాగునీటి విడుదల విషయంలో మాజీ ఎమ్మెల్యే అసత్య ప్రచారాలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.గత బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కొత్త ఆయకట్టు (డోకూర్, మినిగొనిపల్లి) కు రెండో పంటకు నీళ్లు ఇవ్వలేదని.

షెడ్యూల్లో ఎప్పుడు కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవని...బిఆర్‌ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి మాట్లాడించడం సరైంది కాదన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉండి రైతులను మభ్యపెట్టింది చాలక ప్రతిపక్షంలో కూడా బిఆర్‌ఎస్ నాయకులు రైతులను మభ్యపెట్టి, రైతులను నష్టపరచాలన్న ఆలోచనలను మానుకోకపోతే రైతులే వారికి సరైన బుద్ధి చెప్తారని బిఆర్‌ఎస్ తీరుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండల కాంగ్రెస్ అధ్యక్షులు, దేవరకద్ర పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.