calender_icon.png 19 April, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు వేలాది మంది తరలాలి

18-04-2025 04:55:20 PM

పాల్వంచలో కార్యకర్తలకు వనమా విజ్ఞప్తి

కొత్తగూడెం నియోజకవర్గంలో అన్ని గ్రామ ప్రాంతాల్లో గులాబీ జెండాలు ఎగురవేద్దాం

పాల్వంచ(విజయక్రాంతి): ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతోందని పతనం తప్పదని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఒక్క కే సీ ఆర్ వలననే సాధ్యమని ఆయనే రాష్ట్రానికి రక్ష అన్నారు. ఇక వరంగల్ సభతో కాంగ్రెస్ ఖేల్  ఖతమని 10 లక్షల మందితో వరంగల్ సభ జయప్రదం చేయాలన్నారు. 27న తెలంగాణ రాష్ట్రం మొత్తం గులాబీమయం అవుతుందని ఆస్తులు అమ్మడం - అప్పులు తేవడం కాంగ్రెస్ ఎజెండా గా పాలన ఉందన్నారు. 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ 420 వాగ్దానాలను చేసి అధికారంలోకి వచ్చిన పాలనలో  పూర్తిగా విఫలమైందన్నారు.