calender_icon.png 19 April, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ దండు కదలాలి: కాపు కృష్ణ దంపతులు

18-04-2025 09:45:30 PM

కొత్తగూడెం కదం తొక్కాలే.. వరంగల్ దద్ధరిల్లాలే..!

కొత్తగూడెం,(విజయక్రాంతి): బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే బహిరంగ సభకు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున గులాబీ దండు కదలాలని, పాతికేళ్ల పండుగకు కదం తొక్కాలని.. గులాబీ సైన్యం కవాతుతో వరంగల్ దద్ధరిల్లాలని, కొత్తగూడెం మున్సిపల్,మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, టీబీజీకేఎస్ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ అన్నారు. వరంగల్ లో జరిగే సభకు,శుక్రవారం  కొత్తగూడెం పట్టణంలోని రామవరంలో, ప్రధాన రహదారి ప్రక్కన కాపు సీతాలక్ష్మి, కాపు కృష్ణ, స్వయంగా వాల్ రైటింగ్ రాశారు.

ఈ సందర్భంగా కాపు దంపతులు మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం స్వేఛ్చా వాయువులు పీల్చారని, నేడు అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నిజాం కాలం నాటి రాచరికపు పాలన సాగిస్తోందని, ప్రశ్నిస్తే కేసులు, దాడులు‌, చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు గాలికి వదిలి, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన కేవలం ఏడాది లోనే ప్రజలు, విసిగి వేసారి పోయారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, గాలిలో కలిసిపోయాయని, బీఆర్ఎస్ ను దూరం చేసుకుని తాము ఏం కోల్పోయామో,ప్రజలంతా గ్రహించారని అన్నారు. రజతోత్సవ సభను సక్సెస్ చేయడంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు ప్రముఖ పాత్ర పోషించాలని అన్నారు. వీరి వెంట, కాజా బాక్ష, మజీద్, పూర్ణ, పెంట్రాజ్, జనిత్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.