calender_icon.png 21 April, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభపోస్టర్ ఆవిష్కరణ

21-04-2025 12:52:45 AM

భీమదేవరపల్లి, ఏప్రిల్ 20 (విజయ క్రాంతి) ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో జరగనున్న బి ఆర్ ఎస్ రజితోత్సవ  మహాసభ పోస్టర్ను బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మండల సురేందర్  ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం జరిగింది. బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గం లోని ఎల్కతుర్తి లో నిర్వహించబోయే రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు మాజీ ఎమ్మెల్యే  సతీష్ కుమార్  పర్యవేక్షణలో అట్టహాసంగా జరుగుతున్నాయి.

కెసిఆర్ అభిమానులు ఈ మహాసభకు పది లక్షల పైననే హాజరవుతారు. ఏప్రిల్ 27 న జరగబోయే రజితోత్సవ మహాసభ దేశంలోనే ఒక గొప్ప మహాసభగా వర్ధిల్లుతుంది. ప్రపంచమంతా  ఈ మహాసభ వైపు చూసే విధంగా నభూతో నభవిష్యత్ అనే విధంగా జరుగుతుంది.

నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజానీకాన్ని తనమాటతో ఒక్క తాటిపై నడిపించి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి ఢిల్లీ మెడలు వంచి మనకు రాష్ట్రాన్ని తీసుకువచ్చిన మాహా నాయకుడు కెసిఆర్  ఈ మహాసభకు హాజరవుతారు. నేడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు.

కెసిఆర్  మాట కోసం ఎదురు చూస్తున్నారు. కెసిఆర్  నాయకత్వాన్ని బలపరుస్తూ లక్షలాదిమంది హాజరయ్యే ఈ సభకు  హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్  ఆదేశానుసారం నుండి  భీమదేవరపల్లి మండలం నుండి 15,000 మంది కెసిఆర్  అభిమానులు సమావేశానికి రావాలని పత్రికాముఖంగా పిలుపునిస్తూ ఈ మహాసభను విజయవంతం చేయాలని బిఆర్‌ఎస్ కార్యకర్తలను, కెసిఆర్ అభిమానులను భీమదేవరపల్లి బిఆర్‌ఎస్ మండల పార్టీ పక్షాన కోరుతున్నాం.

కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వంగ రవీందర్ ,మాడిశెట్టి కుమారస్వామి , అప్పని బిక్షపతి , మాడుగుల అశోకు , దార్న శ్రీనివాస్  కొండ్ర రజనాచారి, కండే సుధాకర్ , అంబాల చక్రపాణి పాల్గొన్నారు.