calender_icon.png 19 April, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిఆర్ఎస్ సభ విజయానికి కసరత్తు....

18-04-2025 05:39:26 PM

ఈనెల 27న వరంగల్లో 10 లక్షల మందితో సభ...

ప్రతి మండలం నుండి 5000 మంది కార్యకర్తల తరలింపు...

బిఆర్ఎస్ రాష్ట్ర నేత మాజీ ఎంపీపీ వై కుమార్ గౌడ్...

రఘునాథపల్లి: వరంగల్ లో ఈ నెల 27న జరిగే భారత రాష్ట్ర సమితి రథోత్సవ సభను విజయవంతం చేసేందుకు గ్రామ గ్రామాన వాల్ రైటింగ్ తో పాటు ప్రచారం నిర్వహిస్తున్నామని అలాగే ప్రతి మండలం నుండి 5000 మంది పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివస్తున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నేత మాజీ ఎంపీపీ వై కుమార్ గౌడ్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడాతూ... బిఆర్ఎస్ రథోత్సవ సభ కనివిని ఎరుగని రీతిలో జరగనుందని ఆయన తెలిపారు.

ఈ సభకు 10 లక్షల మంది రానున్నారని ఆయన తెలిపారు.. దేశంలో తెలంగాణకు గుర్తింపు తెచ్చింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కాంగ్రెస్ బిజెపి నేతలను కార్యకర్తలు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.