21-04-2025 01:30:18 AM
సీడీ ఆవిష్కరణ
హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): వరంగల్‌లో ఈనెల 27న జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్ రూపొందించిన పాటల సీడీని ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. పాటలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ రాసిన సాహిత్యం బాగుందని కేటీఆర్ కితాబిచ్చారు. పాటకు సాహిత్యం ఫీనిక్స్, గాయని సంధ్యసత్యం అందించారు.