calender_icon.png 22 April, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

22-04-2025 12:33:15 AM

మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 21 ( విజయ క్రాంతి ) : ఈ నెల 27 న వరంగల్ లో జరిగే బిఆర్‌ఎస్ పార్టీ  రజతోత్సవ సభ ను విజయవంతం చేయాలని భువనగిరి పట్టణ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నాడు సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు.   ఈ సందర్భంగా  మాజీ శాసనసభ్యులు బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్  పైళ్ల శేఖర్ రెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్  తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరిగింది మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు, నూతన జిల్లాల ఏర్పాటు, నూతన కలెక్టరేట్ భవనాల నిర్మాణం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ క్యామ మల్లేశం గారు, భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎన్నబోయిన ఆంజనేయులు, పెంట నరసింహ నువ్వుల ప్రసన్నా సత్యనారాయణ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు కాజా అజీముద్దీన్, దిడ్డికాడి భగత్ నాయకులు కుశంగల రాజు, చెన్న మహేష్, కడారి వినోద్, తుమ్మల పాండు, చిక్కా ప్రభాకర్ గౌడ్, సుదగాని రాజు, సిద్దుల పద్మ, రత్నపురం పద్మ, బర్రె రమేష్, ఎన్నబోయిన జాంగిర్, తాడూరు బిక్షపతి,తాడం రాజశేఖర్, ఇక్బాల్ చౌదరి, ఇస్మాయిల్, ముజీబ్,నాగు, పెంట నితీష్, నాగారం సూరజ్, సైదులు, ఇండ్ల శ్రీనివాస్, పాల్గొనడం జరిగింది.