19-04-2025 06:35:30 PM
సంగారెడ్డి: బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా ఈనెల 27వ తేదీన వరంగల్ లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్(MLA Chinta Prabhakar) పిలుపునిచ్చారు. సదాశివపేట పట్టణ శివారులో సదాశివపేట మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు కేసీఆర్ బహిరంగ సభకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కేసీఆర్ బహిరంగ సభ సమయాన్ని వివరించారు. గ్రామ మండల స్థాయిలో బిఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ పోస్టర్లను అంటించాలని కోరారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పెద్దగోల్ల ఆంజనేయులు అరిఫోద్దీన్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడీల సుధీర్ రెడ్డి మల్ల గౌడ్ మాజీ ఎంపీపీ కృష్ణయ్య లక్ష్మారెడ్డి యువత అధ్యక్షులు నరేష్ గౌడ్ ఎస్సీ సెల్ అధ్యక్షులు సుధాకర్ మహిళా అధ్యక్షురాలు అల్లం లలిత మైనార్టీ అధ్యక్షులు నిజాముద్దీన్ బిఆర్ఎస్వి నియోజకవర్గ ఇన్చార్జ్ పెద్దగొల్ల శ్రీహరి తాజా మాజీ ఎంపిటిసిలు మాధవరెడ్డి సంతోష్ గౌడ్ రాములు మన్నెభాస్కర్ రవి సర్పంచులు తాజా మాజీ సర్పంచ్లు శ్రీనివాస్ నల్లుల కుమార్ హనుమంత్ రెడ్డి శేఖర్ మాణిక్ కరుణాకర్ సంగమేశ్వర్ రాములు నాగేష్ అంజన్న నాయకులు శివకుమార్, జానీమియా చోటు మియా లక్ష్మణ్ మల్లేశం బసవరాజ్ శ్రీశైలం మన్సూర్ బాబుమియా యాదయ్య సురెడ్డి వీరయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.