07-04-2025 07:11:18 PM
పార్టీ కార్యకర్తలు భారీగా తరలిరావాలి..
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్..
కామారెడ్డి (విజయక్రాంతి): వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరిగే టిఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో సన్నాక సభ ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గము నుండి 3000 మంది కార్యకర్తలు తరలించాలని నిర్ణయించారు. పార్టీ నిర్ణయించిన సంఖ్యకు తక్కువ కాకుండా ఎక్కువగా తరలించాలని సూచించారు. పార్టీ రజతోత్సవ సభను పురస్కరించుకొని 27న గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించి సభకు బయలుదేరాలన్నారు.
పండగ వాతావరణంలో పార్టీ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. 1500 ఎకరాల్లో చారిత్రాత్మకంగా నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని ప్రధాన చౌరస్తాల్లో వాల్ పెయింటింగ్, పార్టీ నినాదాలను వ్రాయించడం జరుగుతుందన్నారు. ఇప్పటినుండి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి సభకు తరలిరావడానికి ఇంటింటి ప్రచారం నిర్వహించాలని నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గట్టగోని గోపి గౌడ్ మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పరిక్య ప్రేమ్ కుమార్ రాజంపేట విండో చైర్మన్ నల్లవెల్లి అశోక్ మాజీ ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు గండ్ర మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.