calender_icon.png 7 April, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి

05-04-2025 07:56:51 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): ఈనెల 27న హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే బిఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రహీముద్దీన్, దుబ్బాక నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ లు అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో  దౌల్తాబాద్  నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గం అంటేనే ఉద్యమాల గడ్డ అని, నాటి తెలంగాణ పోరాటం నుండి నేటివరకు అడుగడుగునా బిఆర్ఎస్ కు ప్రజలు జేజేలు పలుకుతున్నారన్నారు.

తెలంగాణ ఉద్యమంలో, ప్రత్యేక రాష్ట్ర సాధనలో, తెలంగాణ అభివృద్ధిలో బిఆర్ఎస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. 25 ఏళ్ల పార్టీ ఆవిర్బావ వేడుకలు పండుగలా నిర్వహించాలని కోరారు. బహిరంగ సభకు వెళ్లే ముందు అన్ని గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి బయలుదేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, నాయకులు స్టీవెన్ రెడ్డి, యాదవ రెడ్డి, వెంకట్ రెడ్డి, చిక్కుడు సత్యనారాయణ, వేమ శ్రీనివాస్, సత్తయ్య, బండారు దేవేందర్, కలీలుద్దీన్, నాగరాజు, నర్సింలు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు..