calender_icon.png 27 April, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

27న చలో వరంగల్..

26-04-2025 06:53:02 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): బిఆర్ఎస్ రజతోత్సవ సభకు కొత్తగూడెం నియోజకవర్గం నుండి, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని, కొత్తగూడెం మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి బిఆర్ఎస్ అభిమానులకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఏర్పాట్లు జరుగుతున్నాయని  సభ ప్రాంగణంలో జరిగే పనుల, ఏర్పాట్లను పరిశీలించటం జరిగిందిన్నారు.

ఎవరికీ ఇబ్బంది లేకుండా బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తుందన్నారు. 27వ తేదీ ఆదివారం రోజున వరంగల్ లోని, ఎలుకతుర్తి ప్రాంతంలో జరగనున్న సభకు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ బాపు తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆధ్వర్యంలో జరుగబోతున్న, పార్టీ రజితోత్సవ బహిరంగ సభకు, కొత్తగూడెం నియోజకవర్గం వ్యాప్తంగా, అత్యధిక సంఖ్యలో బిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో, తరలిరావాలని కాపు సీతాలక్ష్మి పిలుపునిచ్చారు.