calender_icon.png 20 April, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రజతోత్సవ వేడుకలతో బీఆర్‌ఎస్ సత్తా చాటాలి

12-04-2025 01:23:02 AM

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ 

మహబూబాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): ఎలుకతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బారాస రజతోత్సవ వేడుకల్లో అత్యధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తా చాటాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. 27న తలపెట్టిన రజతోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా చలో వరంగల్ పోస్టర్  ను శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేస ముద్రం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం కే సీ ఆర్ ప్రాణాలను సైతం కూడా లెక్క చేయలేదని, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పదేళ్లపాటు సుభిక్ష పరిపాలన సాగించా రన్నారు. తెలంగాణ ప్రజలు ప్రస్తుతం మళ్లీ కేసీఆర్ సారే సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

ఎలకతుర్తి రజతోత్సవ సభతో పార్టీ సత్తా నిరూపించి మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, త్వరలో నిర్వహించే స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం సాధించే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఓలం చంద్రమోహన్, మాజీ జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ నీలం సుహాసిని దుర్గేష్, మండల పార్టీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, కార్యదర్శి కమటం శ్రీనివాస్, నాయకులు జాటోత్ హరీష్ నాయక్, మోడం రవీందర్ గౌడ్, సట్ల వెంకన్న, సాయి కృష్ణ, అన్నెపాక వెంకన్న తదితరులు పాల్గొన్నారు.