calender_icon.png 21 October, 2024 | 8:50 PM

బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలి : జూపల్లి

21-10-2024 04:16:55 PM

కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలి

రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి జూపల్లి కృష్ణారావు

నిజామాబాద్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. వాస్తవాలు ఆరోపణలను కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టాలని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం గ్రూప్-1 అభ్యర్థులను, రెచ్చగొడుతున్నారని విమర్శించారు. నిజామాబాద్ లో నూడ చైర్మన్ కేశవేణు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీ, రైతు భరోసా, డబుల్ బెడ్ రూమ్ అంశాలపై  ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో పెద్ద టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల్లోకి నెట్టింది అన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. హోటల్ నమోదు ఉద్యమంగా చేపట్టాలని చెప్పారు. ప్రజలతో మమేకమయ్యే పదవి నూడా అని జూపల్లి అన్నారు. కేశవేణు 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉండడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ తర్వాత అత్యంత పెద్ద జిల్లా నిజాంబాద్ అని, అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల్లో ఒకటిగా ఉండాలని కేశవేణుకు సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ప్రజలతో మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్మధు గౌడ్ యాష్కి, కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి నాయకులు పాల్గొన్నారు.