09-02-2025 03:35:37 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సాజిద్ ఉద్దీన్(BRS Senior Leader Sajid Uddin) డిమాండ్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం పత్రిక సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసపూరిత హామీలఫై తీవ్రంగా ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ ఎన్నికల(Delhi Election) ప్రచారంలో మోసపురితంగా మాట్లాడిన తీరును పసిగట్టి ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ కు గుండు సున్నా ఇవ్వడం జరిగిందన్నారు.
తెలంగాణలో 420 హామీలతో పాటు ఆరు గ్యారెంటీ పథకాలు 100 రోజులో అమలు చేస్తామని ప్రగల్బాలు పలికి తెలంగాణ ప్రజలను పూర్తిగా మోసం చేస్తుందన్నారు. ప్రజాపాలన పేరుతో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ కరెంటు, ఇండ్ల స్థలాలు అందిస్తామని దరఖాస్తులు ప్రజల నుండి తీసుకొని ఒక్కటి సైతం పూర్తి చేయకుండా ప్రజలను మభ్యపెట్టిందన్నారు. ఎన్నికలు ముందు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి ఎన్నికల కోడ్ సాకుతో మరోసారి ఓట్లు రాబట్టే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో మోసానికి తెరలేపుతుందన్నారు.