calender_icon.png 26 April, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ సభను విజయవంతం చేయాలి

26-04-2025 12:00:00 AM

  1. నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలి..
  2. ఎమ్మెల్యే ముఠా గోపాల్..

ముషీరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి) : వరంగల్ లో ఈ నెల 27న నిర్వ హించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు దండులా తరలిరావాలని ఎమ్మె ల్యే ముఠా గోపాల్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి బీఆర్‌ఎస్ భోలక్ పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు అధ్యక్షత వహించగా మ ఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడారు.

రజతోత్సవ సభ సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో గులాబి జెండాలు ఎగరవేయాలని సూచించారు. ప్రతి డివిజన్ కు 10 బస్సులను కేటాయిస్తామని, సభకు 5 వేల మందికి పైగా పార్టీ శ్రేణులు ర్యాలీగా తరలిరావాలని సూచించారు. ఎండలు మండిపోతున్నందున ఉదయమే సభకు తరలిరావాలని కోరారు. పార్టీ సీనియర్ నాయకులు బాధ్యత తీసుకొని ప్రతి పోలింగ్ బూత్ నుంచి కార్యకర్తలను తరలించేందుకు కృషిచేయాలన్నారు.

ఈ  సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎడ్ల హరిబాబు యాదవ్, పెంటారెడ్డి, రెబ్బ రామారావు, బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, ఆరు డివిజన్ల బీఆర్‌ఎస్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ రావు, కొండ శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి, ఎం. రాకేష్ కుమార్, శంకర్ ముదిరాజ్, వల్లాల శ్యామ్ యాదవ్, బీఆర్‌ఎస్ మీడియా సెల్ ఇన్చార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, సీనియర్ నాయకులు బింగి నవీన్, సుధాకర్ గుప్తా, ఆకుల అరుణ్ కుమార్, శివ ముదిరాజ్, దీనదయాల్ రెడ్డి, మాధవ్, ముఠా నరేష్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, వల్లాల శ్రీనివాస్ యాదవ్, బల్లా ప్రశాంత్, జాహంగీర్ పాల్గొన్నారు.

పహల్గామ్ మృతులకు నివాళులు

కాశ్మీర్ లోని పహల్గామ్ పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతిచెందిన వారికి, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ వర్గింగ్ ప్రసిడెంట్ గంజి రాజమౌళి గుప్తా సతీమణి అమృ తమ్మ అకాల మృతిపట్ల ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్‌ఎస్ నాయకులు సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు.