12-04-2025 12:54:01 AM
కల్లూరు, ఏప్రిల్ 11:-బిఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సభను ఒక పండుగలా నిర్వహించా లని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర బిఆర్‌ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.శుక్రవారం పట్టణ పరిధిలో ని డి ఎన్ పి పంక్షన్ హాల్లో బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, మం డల పట్టణ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ఈనెల 27వ వరంగల్లో జరుగు బిఆర్‌ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయ వంతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. నియోజకవర్గ నుండి వేలా ది మంది తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లోమాజీ జడ్పీటీసీ కట్టా అజ య్ బాబు, లక్కినేని రఘు,మాజీ ఎంపీపీ బీరవల్లి రఘు,మండల పార్టీ అధ్యక్షులు పాలెపు రామరావు, కాటం నేని వెంకటేశ్వర రావు,మండల కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, అంకిరెడ్డి వెంకట రెడ్డి,మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.