calender_icon.png 26 April, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ సభ తెలంగాణకు పండుగ

26-04-2025 12:00:00 AM

బీఆర్‌ఎస్ నేత గట్టు రామచందర్‌రావు

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): వరంగల్‌లో జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ తెలంగాణకు పండుగ లాంటిదని ఆ పార్టీ నేత గట్టు రాంచందర్‌రావు పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో పండుగ వాతా వరణం ఉంటే కాంగ్రెస్ నేతలకు మాత్రం కళ్లు మండుతున్నాయని విమర్శించారు. శుక్రవారం తెలంగాణలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి బృందం బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను జీర్ణించు కోలేకపోతోందని ఎద్దేవాచేశారు.

టీఆర్‌ఎస్ రజతోత్సవ సభనా? బీఆర్‌ఎస్ రజతోత్సవ సభనా అని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించడం విచిత్రంగా ఉందన్నారు. 1978లో ఇందిరా కాంగ్రెస్ ఏర్పాటైందని, మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పాతదా? లేక కొత్త దా? అని ప్రశ్నించారు. ఆరేండ్లపా టు కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయి న చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తు తం జాతీయ కాంగ్రెస్‌లో ఉన్నా రా? లేక ఇందిరా కాంగ్రెస్‌లో ఉ న్నారా? అని నిలదీశారు.

టీఆర్‌ఎస్ అయినా, బీఆర్‌ఎస్ అయినా తెలంగాణ పార్టీగానే ప్రజలు గుర్తు పెట్టు కుంటారని స్పష్టంచేశారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ప్రే మ లేదన్నారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ విజయవంతం అవుతుం దని జీర్ణించుకోలేక కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

కాంగ్రెస్, బీజేపీల కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని స్పష్టంచేశారు. తెలంగాణను మళ్లీ ఆంధ్రాతో కలిపే కుట్రకు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారని ఆరోపించారు.