నల్గొండ,(విజయక్రాంతి): నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాధర్నా(Rythu Maha Dharna )కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) హాజరయ్యారు. ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నాగార్జున కళాశాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంజీ కళాశాల నుంచి క్లాక్ టవర్ కూడలి వరకు భారీ ర్యాలి జరిగింది. ఈ బీఆర్ఎస్ ర్యాలీలో కేటీఆర్(KT Ramarao), పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రైతు మహాధర్నాకు వచ్చినట్లు అనింపించలేదని, మాజీ సీఎం కేసీఆర్(KCR) మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారనే రీతిలో తనకు అపూర్వ స్వాగతం లభించిందన్నారు. మళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందనే విధంగా బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా అనిపించిందని తెలపారు.
ప్రపంచంలో ఏ శక్తి కూడా ప్రజా శక్తి కంటే గొప్పది కాదని నల్గొండ పోరాటాల గడ్డ రుజువు చేసిందని హర్షం వ్యక్తం చేశారు. ఆనాడు నిజాం సర్కారును నిలదీసిన నల్గిండ గడ్డ, కానీ నల్గొండకు కేసీఆర్ ఏం చేశారని అసెంబ్లీలో మంత్రి నిలదీశారని గుర్తు చేశారు. వరి ఉత్పత్తిలో నల్గొండ జిల్లా తెలంగాణను దేశంలో నంబర్ వన్ గా నిలిపారని, ఎస్ఆర్ఎస్పీ, ఎన్ఎస్పీ కింద టెయిల్ ఎండ్ గ్రామాలకు నీళ్లు వచ్చేవి కాదన్నారు. రైతు నాయకుడు కేసీఆర్ కృష్ణా, గోదావరిలో నీళ్లు ఒడిసి పట్టి పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం చేపట్టి చివరి మడి వరకు నీళ్లు ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26న రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పి ఎందుకు వేయలేదని కేటీఆర్ ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ హయంలో కేసీఆర్ రైతుబంధు కింద రైతు ఖాతాల్లో రూ.73 వేల కోట్లు జమచేశారు. నల్గొండ బిడ్డలు జీవచ్ఛవాలుగా మరడానికి, రైతులు అవస్థలు పడడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ విమర్శించారు.