calender_icon.png 22 October, 2024 | 8:35 PM

తెలంగాణను దోచుకున్న బీఆర్‌ఎస్

22-10-2024 12:54:45 AM

  1. ఉనికి కోసం హరీశ్‌రావు, కేటీఆర్ ఆరాటం
  2. ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ, అక్టోబర్ 21(విజయక్రాంతి): పదేళ్ల పాటు తెలంగాణను పాలించిన బీఆర్‌ఎస్ సర్వం దోచుకున్నదని, కేసీఆర్ కుటుం బం రూ.లక్షల కోట్లు వెనకేసుకుందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమ ర్శించారు. సోమవారం జనగామ వ్యవసా య మార్కెట్‌లో కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.

కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరై మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్, వైస్ చైర్మన్ కొల్లూరి నర్సింహులు, డైరెక్టర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో కడియం శ్రీహరి మాట్లాడారు. పదేళ్ల పాటు నిరుద్యోగుల జీవితాలతో బీఆర్‌ఎస్ ఆడుకుందని, ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో విద్యార్థులను మోసం చేసిందన్నారు.

సీఎం రేవం త్ రెడ్డి ఒక్కో శాఖలో ఖాళీలను భర్తీ చేస్తుంటే ఓర్వలేక బీజేపీ, బీఆర్‌ఎస్ రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితం కాగా హరీశ్‌రావు, కేటీఆర్ ఉనికి కోసం ఆరాటపడుతు న్నారని ఎద్దేవా చేశారు.

బండి సంజయ్ కేంద్ర మంత్రి అనే విషయం మర్చిపోయి రోడ్డెక్కి ఆందోళనలు చేస్తూ దిగజారి వ్యవహరిస్తున్నారన్నారు. కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ ప్రెస్‌మీట్‌లు పెడుతున్నారే తప్ప, బీజేపీకి ఒక విధానం లేదన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతా ప్‌రెడ్డి, నాయకులు మేడ శ్రీనివాస్, బోరింగ్ మల్లారెడ్డి, నూకల బాల్‌రెడ్డి పాల్గొన్నారు.