మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
రాజేంద్రనగర్, డిసెంబర్ 11: తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నందుకే బీఆర్‌ఎస్ ఓర్వడం లేదని రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ ధ్వజమెత్తారు. బుధవారం నార్సింగి మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు అసలు సోయే లేదన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ సర్కారు చేసిన అప్పులను తాము తీరుస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్ ఎంత వరకైనా వెళ్తుందన్నారు.
కోట వేణుగౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, దశరథ యాదవ్ వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు డైరెక్టర్లుగా కూడా ప్రమాణం చేశారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నాయకులు ముంగి జైపాల్‌రెడ్డి, అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.