27-04-2025 08:57:07 PM
కొల్చారం (విజయక్రాంతి): వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ బహిరంగ సభకు మండల వ్యాప్తంగా పలు వాహనాలలో భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు మండలంలోని నాయకులు, కార్యకర్తలు, ఎంతో ఆనందంతో బహిరంగ సభకు భారీగా తరలి వెళ్లారు. ప్రతి గ్రామంలో పార్టీ జెండాలు ఎగరవేసి జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా మాట్లాడుతూ... ప్రజలు కాంగ్రెస్ పాలనపై విసిగిపోయి నమ్మకం లేని పాలన అని మళ్లీ కెసిఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వరంగల్ బహిరంగ సభకు తరలి వెళ్లిన వారు వివిధ గ్రామాల పిఎసిఎస్ చైర్మన్లు మాజీ జెడ్పిటిసి మాజీ ఎంపీపీ మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు.