calender_icon.png 22 February, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ తల్లికి బీఆర్‌ఎస్ శ్రేణుల క్షీరాభిషేకం

21-02-2025 12:00:00 AM

ఆదిలాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధనలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని ఆ పార్టీ శ్రేణులు కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధన బిల్లు పార్లమెంటులో ఆమోదం తెలిపిన రోజును పురస్కరించుకొని ఆదిలాబాద్ లో పార్టీ శ్రేణులు గురువారం సంబరాలు జరుపుకున్నారు.

స్థానిక పార్టీ కార్యాలయంలో బీ.ఆర్.ఎస్.వి నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలతో అలంకరించారు. తెలంగాణ ప్రజల కల సహకారం దిశగా ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు మాజీ సీఎం కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు చేశారని బీఅరెస్వి జిల్లా అధ్యక్షుడు శివ కుమార్ అన్నారు.