18-03-2025 12:41:10 AM
ఎమ్మెల్యే ముఠాగోపాల్
ముషీరాబాద్, మార్చి 17: (విజయక్రాం తి) : ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అంకిత భావంతో పనిచేసి బీఆర్‌ఎస్ ను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకుడు దీన్ దయాల్ రెడ్డి పార్టీ అభ్యున్నతికి చేస్తున్న కృషిని అభినందిస్తూ ఆయన కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఈ కార్యక్రమానికి హాజరై దీన్ దయాల్ రెడ్డిని సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బూత్ స్థాయి నుంచి పార్టీని బలో పేతం చేసేందుకు బీఆర్‌ఎ ఎస్ సిద్దాంతాలు, ఆశయాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేయాలని పేర్కొన్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నియోజకవర్గంలో ఘన విజయం సాధించేలా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు శివముదిరాజ్, టెంట్ హౌస్ శ్రీనివాస్, పూసగోరక్ నాథ్ పాల్గొన్నారు.