calender_icon.png 31 January, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసన

31-01-2025 12:19:56 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో -గాంధీ విగ్రహాలకు వినతిపత్రాల అందజేత

నల్లగొండ, జనవరి 30 (విజయక్రాం తి) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ నల్ల గొండ జిల్లావ్యాప్తంగా బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు గాంధీ విగ్రహాలకు వినపత్రం అందజేశారు.

గురువారం మహాత్ముడి వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యనిర్వా హక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపా ల్‌రెడ్డి, నోముల భగత్, నల్లమోతు భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు,

కార్యకర్తలతో కలిసి ఆయాచోట్ల గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. దొంగ హామీలతో ప్రజలను మోసగించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిం దని ఆరోపించారు. హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టమన్నారు.

యాదాద్రి జిల్లాలో...

యాదాద్రి భువనగిరి, జనవరి 30 (విజయక్రాంతి) ః బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన  420 హామీలను అమలు చేయాలని కోరుతూ  మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా బీ ఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు ఎక్కడి కక్కడ వినతి పత్రాలను అందజేశారు.

చౌటుప్పల్, రామన్నపేట మోత్కూరు వలి గొండ యాదగిరిగుట్ట ఆరేరు బీబీనగర్ భూదాన్ పోచంపల్లి భువనగిరి పట్టణ కేం ద్రాలలో బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వా నికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దగాకోరు ప్రభుత్వం అంటూ విమర్శిం చారు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చ కుండా ప్రజలను రేవంత్ సర్కార్ మోసం చేసిందని నాయకులు విమర్శించారు.

భువనగిరిలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ర్ట నాయకులు చింతల వెంకటేశ్వ ర్ రెడ్డి మాట్లాడుతూ మోసపూరిత హామీల తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను నిరుద్యోగులను విద్యార్థులకు మహిళలకు వృద్ధులకు వికలాంగులకు అన్ని రంగాల కార్మికులందరినీ మోసం చేసిందని ఆరోపించారు. మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డికి కెసిఆర్, కేటీఆర్ లను విమర్శించే అరత లేదని అన్నారు.

కెసిఆర్ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయా డని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన 6 గ్యారంటీ అని అమర చేయడంలో పూర్తిగా విఫలమైన రేవంత్ సర్కార్ కు ప్రజల గుణ చెప్తారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండ ల పార్టీ నాయకులు జనగాంపండు, మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేష్, సింగిల్ విండో చైర్మన్ నోముల పరమేశ్వర్ రెడ్డి పార్టీ నాయకులు కుతాడు సురేష్, విజయ్, అశోక్, బాలరాజు, కిరణ్, బాలరాజు, సం దీప్, నవీన్, యాకూబ్, షరీఫ్, మనోహర్, బషీర్, లక్ష్మణ్, నరసింహ, కొండల్ చంద్ర మోహన్, నరేష్ పాల్గొన్నారు.

సూర్యాపేట జిల్లాలో..

సూర్యాపేట, జనవరి 30 (విజయక్రాం తి) ః ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం  మోసం చేస్తుందని బీఆర్ ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కేంద్రం తో పాటు ఆయా  మండల కేంద్రంలోని గాంధీ విగ్రహల వద్ద నిరసన తెలిపి విగ్రహానికి పూలమాల వేసి  ఘనంగా నివాలి ఘటించి వినతిపత్రం అందజేశారు.

అనంతరం మాట్లాడుతూ నేటి వరకు కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని, రైతులను రైతు భరోసా పేరుతో దగా చేస్తుం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ లన్నీ పూర్తిస్థాయిలో వచ్చేవరకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ పార్టీతో పోరాటం చేస్తామని హెచ్చరించారు. దావో స్‌లో చీకటి ఒప్పందాలే తప్ప, అభివృద్ధికి నిధులే లేవని ఎద్దేవా చేశారు.