calender_icon.png 29 April, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్ సభకు తరలిన బీఆర్‌ఎస్ శ్రేణులు

28-04-2025 02:04:10 AM

చేవెళ్ల, ఏప్రిల్ 27: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు  బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు చేవెళ్ల నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఆదివారం చేవెళ్ల మండలం ముడిమ్యాల నుంచి సీనియర్ నేత గోనె కరుణాకర్ రెడ్డి, కమ్మెట నుంచి మాజీ సర్పంచ్ పట్లొళ్ల హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సులు, కార్లలో వందల సంఖ్యలో బయల్దేరి వెళ్లారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుందని విమర్శించారు.    పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు శేరి రాజు, ఎండీ ఆరిఫ్, కావలి రమేశ్,  ఎస్ మహేందర్, జే. కృష్ణ, ఎస్ సతీశ్, యూ.సురేశ్, మహేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.