27-04-2025 10:06:25 AM
హైదరాబాద్: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నాడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ(BRS Party Foundation Day) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రజతోత్సవం సందర్భంగా ఎల్కతుర్తిలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఎల్కతుర్తి సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) పాల్గొననున్నారు. బీఆర్‌ఎస్(Bharat Rashtra Samithi) రజతోత్సవ సభకు ఎడ్లబండ్లపై పార్టీ శ్రేణులు పయనం అయ్యారు. ఈ భారీ సభలో బీఆర్ఎస్ నేతలు పాల్గొనున్నారు. ఎల్కతుర్తిలో 1,250 ఎకరాల విస్తీర్ణంలో బీఆర్ఎస్ సభకు ఏర్పాట్లు చేసింది. బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25 వసంతంలోకి అడుగుపెడుతోంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎల్కతుర్తిలో సభ ప్రారంభం కానుంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెలికాప్టర్ లో ఎల్కతుర్తికి వెళ్లనున్నారు. సభకు 10 లక్షల మంది వస్తారనే అంచనాలతో భారీగా ఏర్పాట్లు చేశారు. 500 మందికి సరిపడే విధంగా భాహుబలి వేదిక నిర్మాణం చేపట్టారు. 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిళ్లు సిద్ధం చేశారు. సభకు వచ్చే ప్రజల సౌకర్యం కోసం రెండున్నర వేల మంది వాలంటీర్లను పెట్టారు. వెయ్యి ఎకరాలను 5 జోన్లగా విభజించి పార్కింగ్ సౌకర్యం కల్పించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 12 గంటల వరకు ఎల్కతుర్తికి వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నారు. నేడు బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పార్టీ జెండా ఎగరవేయనున్నారు. అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్ నివాళులు అర్పించనున్నారు. పార్టీ ఏర్పాటైన జలదృశ్యం వద్ద కొండా లక్ష్మణ్ బాపుజీకి నివాళులర్పించనున్నారు.