03-03-2025 02:08:33 PM
క్వింటాకు 30.000/- రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలి
బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ నిరసనలు
నిరసనలకు పిలుపునిచ్చిన రావులపల్లి, మానే
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా మిర్చి ఆధారిత రైతాంగం ఎక్కువగా ఉండి ఆరుగాలం కష్టపడ్డ రైతుకి గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. క్వింటా మిర్చికి మద్దతు ధర కనీసం రూ.30 వేలు ఇవ్వాలని, రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నియోజకవర్గంలోని చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, పార్టీ శ్రేణులకు నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ పిలుపునిచ్చారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్ళు తెరిపించాలని వారు కోరారు.