14-03-2025 10:14:16 PM
మందమర్రి,(విజయక్రాంతి): కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని బిఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ రాజా రమేష్ విమర్శించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై నిరసన వ్యక్తం చేస్తూ రామకృష్ణాపూర్ పట్టణంలోని స్థానిక రాజీవ్ చౌక్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయ కుండా కాలయాపన చేస్తుందని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ స్పీకర్ కి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని, ప్రజల సమస్యలను అసెంబ్లీలో గళం వినిపిస్తున్న ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డినీ సస్పెన్షన్ విధించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కంభగోని సుదర్శన్ గౌడ్, నాయకులు బడికల సంపత్, రామిడీ కుమార్, పోగుల మల్లయ్య, రేవెల్లి ఓదేలు, ఆలుగుల సత్తయ్య, లు పాల్గొన్నారు.