calender_icon.png 16 March, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలన అంటూనే గొంతు నొక్కుతున్నరు

15-03-2025 11:23:16 PM

అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై బీఆర్ఎస్ నిరసన..

సీఎం రేవంత్ ప్లెక్సీ దహనం..

హుస్నాబాద్ (విజయక్రాంతి): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. తమది ప్రజాపాలన అంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం  అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతునొక్కుతోందని మండిపడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆ పార్టీ కార్యకర్తలు  ఆందోళన నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో  సీఎం రేవంత్ ఫొటో ఉన్న ప్లెక్సీని దహనం చేశారు.

జగదీశ్ రెడ్డిని అసెంబ్లీ నుంచి బయటికి పంపడం అప్రజాస్వామికమన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్ఎస్ నేతల గొంతు నొక్కేందుకు సీఎం రేవంత్ సస్పెన్షన్లను ఆయుధంగా మలుచుకున్నారని మండిపడ్డారు. ఈ ఆందోళనలో ఆ పార్టీ  నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జునరెడ్డి, హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు అన్వర్ పాషా, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఆకుల రజిత, మాజీ ఎంపీపీ వెంకన్న, నాయకులు అనిత, తిరుపతిరెడ్డి, భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.