బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి..
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్..
నిజామాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పనితీరును నిరసిస్తూ జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అశన్న గారి జీవన్ రెడ్డి తెలిపారు. గురువారం రోజు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందించి నిరసన తెలుపుతామని ఇందుకుగాను పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 30వ తేదీ నాటికి 420 రోజులైన సందర్భంగా ప్రజలకిచ్చిన 420 ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చి ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని ఆయన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలలో అన్ని వర్గాల ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అన్ని స్థాయిల పార్టీ నాయకులు, ప్రస్తుత, మాజీ ప్రజాప్రతి నిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.