ఎల్లారెడ్డిపేట, జనవరి6: మండల కేంద్రం లో రైతులకు మద్దతుగా బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు సోమవారం నిరసన వ్యక్తం చే శారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి లక్ష్మ ణ్ రావు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫె స్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కిం ద ఎకరానికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ. 12 వేలు ప్రకటించ డంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నిరసన చేపట్టడం జరిగిందని తెలి పారు.
రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ఎకరానికి బాకీ పడ్డ రైతు భరోసా రూ.17, 500 వెంటనే విడుదల చేయాలని,ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేదంటే పెద్ద ఎత్తు న ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణ హరి, నాయకులు కొండ రమేష్ గౌడ్, అందే సుభాష్, నరసింహారెడ్డి, బాల్ రెడ్డి, భాస్కర్, శివరామకృష్ణ, కార్యకర్త లు పాల్గొన్నారు.