07-03-2025 02:49:43 PM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశం
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ(Bharat Rashtra Samithi) ఆవిర్భావ రజతోత్సవ వేడుకల నేపథ్యంలో ఏప్రిల్ 27 నాడు జరిపే బహిరంగ సభకు సంబంధించిన సన్నాహక సమావేశం బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao) అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవాలకు సమాయత్తం కావాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao), కవిత, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.