calender_icon.png 12 March, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణికొండ అభివృద్ధిలో బీఆర్‌ఎస్‌ది కీలక పాత్ర

12-03-2025 12:15:03 AM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

పార్టీ సీనియర్ నేత గట్టు రామచందర్ రావుకు పరామర్శ 

 రాజేంద్రనగర్, మార్చి 11 (విజయక్రాంతి): మణికొండ అభివృద్ధిలో బిఆర్‌ఎస్ పార్టీ కీలకపాత్ర పోషించిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో పని చేశారని అన్నారు. మంగళవారం కవిత మణికొండ మున్సిపల్ పరిధిలోని అల్కాపురి కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న బిఆర్‌ఎస్ సీనియర్ నేత గట్టు రామచందర్ రావు ను పరామర్శించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులతో మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మణికొండ ప్రాంతంలో అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువగా ఉందని, ప్రతి అపార్ట్మెంట్లో ఏదో ఒక సమస్య ఉంటుందని అన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం బిఆర్‌ఎస్ నేతలు నిరంతరం జనంలో ఉంటూ వారితో మమేకమై పని చేయాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో పని చేశారని కొనియాడారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్‌ఎస్ నేతలు తాగునీటి సమస్యల పరిష్కారానికి తగిన చొరవ తీసుకోవాలని సూచించారు. వివిధ కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లో ఉంటూ బాగా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా స్థానిక టిఆర్‌ఎస్ నేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ బిఆర్‌ఎస్ ప్రెసిడెంట్ సీతారాం ధూళిపాళ్ల, ప్రెసిడెంట్ ధనరాజ్, శ్రీకాంత్, మహిళా విభాగం అధ్యక్షురాలు రూపా రెడ్డి, కీర్తి లతా గౌడ్, సుమ, మల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.