calender_icon.png 17 March, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు

17-03-2025 12:52:06 AM

డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి 

 గజ్వేల్, మార్చి 16:  దళితుడైన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిలను వెంటనే  శాసనసభ  సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిసిసి అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.  శనివారం బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ దిష్టిబొమ్మలను  గజ్వేల్ ఇందిరా పార్క్  చౌరస్తా,  వర్గల్ మండల కేంద్రాల్లో  కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు.  ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ  శాసనసభలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై  ఎమ్మెల్యే  జగదీశ్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడుతూ ఆగౌరవపరిచి, శాసనసభ సంప్రదాయాలను తుంగలో తొక్కినందుకు, జగదీష్ రెడ్డికి మద్దతుగా నిలిచిన బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశామని తెలిపారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు ఆ పార్టీకే దళితులంటే చిన్నచూపని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు కాగానే దళిత ముఖ్యమంత్రిని చేస్తామని మోసం చేశారని, మంత్రి రాజయ్యను కూడా బర్తరఫ్ చేశారని గుర్తు చేశారు.

దళితుడైన  గడ్డం ప్రసాద్ శాసనసభ స్పీకర్ గా కాంగ్రెస్ పార్టీ నియమిస్తే అధ్యక్షా అని సంబోధించాల్సి వస్తుందని కెసిఆర్  శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదని తెలిపారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు  జగదీశ్ రెడ్డి ని అసెంబ్లీ నుండి బహిష్కరించడమే కాకుండా అతని యొక్క సభ్యత్యాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరారు. కెసిఆర్ ప్రభుత్వం అందిస్తున్న జీతభత్యాలను తీసుకుంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదని ఆరోపించారు. గజ్వేల్ ప్రజలు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి రెండుసార్లు సీఎం గా మూడోసారి ప్రతిపక్ష నాయకుడిగా హోదా కట్టబెట్టినా కూడా ప్రజల్లోకి వచ్చి సమస్యలు పరిష్కరించకుండా ఫామ్ హౌస్ లోనే తాగి పడుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు 57 లక్షల జీతభత్యాలను ఎమ్మెల్యేగా కెసిఆర్ తీసుకున్నారని ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న ఒక్కసారి కూడా ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ప్రజలను కలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో ఏఏంసి చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, ఏం సి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్, నాయకులు సాజిద్, సుఖేందర్  రెడ్డి  శ్రీనివాస్ రెడ్డి,  లక్ష్మారెడ్డి నక్క రాములు గౌడ్, అజహర్, రమేష్ గౌడ్, రాములు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.