calender_icon.png 26 March, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులు చేస్తున్న వంట వార్పు ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు

25-03-2025 08:29:39 PM

మాజీ మంత్రి వనమా...

కొత్తగూడెం (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు స్థలం కేటాయించుకుంటే జర్నలిస్టులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు హెచ్చరించారు. జర్నలిస్టుల ఆందోళనలో భాగంగా మంగళవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో జర్నలిస్టులు చేపట్టిన వంట వార్పు కార్యక్రమనికి విచ్చేసి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తమ ప్రభుత్వ హయాంలోనే జర్నలిస్టులకు అవసరమైన ఇంటి స్థలాన్ని కేటాయించామన్నారు.

అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇంటస్థలాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేయడానికి పట్ల ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఎంపీపీ బాదవత్ శాంతి, మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, మాజీ కౌన్సిలర్ అంబుల వేణు, రుక్మాందర్ బండారి, వేముల ప్రసాద్, మాజీ కోఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్వాల సత్యం, సత్యనారాయణ (సంపు), అడ్వకేట్ సాదిక్, నవతన్ తదితరులు పాల్గొన్నారు.